నేడు కామెడి సినిమాలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తాజాగా మంచు విష్ణు అదే తరహా సినిమాతో ముందుకు రానున్నారా అంటే ఆయన కొత్త సినిమా టైటిిల్ అదే చెబుతోంది. మొదటి నుంచి కూడా మంచు విష్ణు తన తండ్రి తరహాలో యాక్షన్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. 'ఢీ' .. 'దేనికైనా రెడీ' .. 'దూసుకెళ్తా' .. 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. 'మోసగాళ్లు' ఫ్లాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తన పిల్లల పేరుతో ఎ.వి.ఎ. అనే బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని తానే హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగాడు .. ఆ సినిమా పేరే 'గాలి నాగేశ్వరరావు'. టైటిల్ ను బట్టే ఇది కామెడీ ప్రధానమైన సినిమా అనే విషయం అర్థమవుతోంది. తాజాగా ఈ టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఇంతకుముందు 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈషాన్ సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కోన వెంకట్ కథ అందించగా భాను - నందు సంభాషణలు సమకూర్చుతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక శ్రీను వైట్లతో ఎనౌన్స్ చేసిన 'డి అండ్ డి' ఇప్పట్లో లేనట్టే అనుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa