ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZEE5 ఒరిజినల్‌తో OTTలో ఎంట్రీ ఇస్తున్న సుశాంత్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 01:12 PM

భారతీయ నటీనటులు ఈ మధ్యకాలంలో వెబ్ ఫిల్మ్‌లు అండ్ వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.తాజాగా ఇప్పుడు టాలీవుడ్‌ యంగ్ హీరో OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.కరెంట్,అడ్డా,చి ల సౌ,అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని సుశాంత్ ఇప్పుడు ZEE5 వెబ్ సిరీస్‌కి సైన్ చేశారు.సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు.ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సిరీస్ నుండి సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేసారు.పోస్టర్ ద్వారా,ZEE5 ఒరిజినల్‌లో సుశాంత్ పోలీసు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.కొల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రవీణ్ కొల్లా ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa