సాయి పల్లవి.. పరిచయం అవసరం లేని, తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి. అచ్చు తెలుగమ్మాయిలానే అనిపించే సాయి పల్లవి ఇటీవలే ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ "విరాటపర్వం" తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాకు క్రిటిక్స్, ప్రేక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లను రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది.
తెలుగులో విరాటపర్వం చేసిన వెంటనే సాయి పల్లవి మలయాళంలో మరొక ఉమెన్ సెంట్రిక్ మూవీ "గార్గి" చేసింది. మలయాళం, తమిళం, తెలుగు భాషలలో జూలైలో విడుదలైన ఈ సినిమా సైలెంట్ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల గ్రాస్, ఆరున్నర కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక, ఈ సినిమా అన్ని భాషల పోస్ట్ థియేట్రికల్ హక్కులు ఇరవై కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా, రూ. 5 కోట్లతో తెరకెక్కిన గార్గి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇరవై కోట్ల లాభాలను అందించింది.
విరాటపర్వం తరువాత సాయి పల్లవికి సోలోగా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చేంత సత్తా లేదని ప్రచారం జరిగింది. కానీ, గార్గి ఆ నెగిటివిటీని పూర్తిగా చెరిపేసి, ఇకపై నిర్మాతలు సాయి పల్లవితో ఎలాంటి మీమాంసాలకు పోకుండా హ్యాపీగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసుకోవచ్చన్న నమ్మకం ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa