పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిర్మితమవుతోంది. పూరి సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో రామ్ మాస్ లుక్ తో డిఫరెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.అయితే తాజాగా నిధి అగర్వాల్ .. నభా నటేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. రామ్ సరసన ఈ ఇద్దరినీ ఖరారు చేసే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. చైతూ .. అఖిల్ జోడీగా మెరిసిన నిధి అగర్వాల్ కి గ్లామర్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇక 'నన్ను దోచుకుందువటే'తో హిట్ పడినప్పటికీ, నభా నటేశ్ కి ఆ వెంటనే మంచి ఛాన్స్ పడలేదు. ఈ ఇద్దరు కథానాయికల కెరియర్ కి పూరి సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa