by Suryaa Desk | Fri, Dec 27, 2024, 11:12 AM
సాయి పల్లవి గతంలో ఓ వాణిజ్య ప్రకటనను రిజెక్ట్ చేశారు. ఆ యాడ్ చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. కాస్మోటిక్ కు సంబంధించిన ఆ యాడ్ చేసేందుకు సాయి పల్లవి నిరాకరించారు. సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని.. దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని.. అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని తిరస్కరించారు.చదివింది వైద్య విద్య.. అయినా సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందరినీ మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ జోడిగా రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. గ్లామర్ కు దూరంగా ఉంటూ.. సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ అడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది.
Latest News