by Suryaa Desk | Fri, Dec 27, 2024, 03:54 PM
పెళ్లి.. ప్రతిఒక్కరికి ఎంతో అద్భుతమైన ఘట్టం. ఇద్దరు కలిసి ప్రయాణం చేయాల్సిన జీవితం. ప్రేమించే సమయంలో ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు.కానీ, పెళ్లి తరువాత ఒకరి గురించి ఒకరివి నిజాలు తెలుస్తాయి. అసలు లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలను తట్టుకోలేకనే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకు నిండు నూరేళ్ళ జీవితాన్ని వదిలేసుకుంటున్నారు.ఎన్ని కష్టాలు అయినా.. నష్టాలు అయినా .. బాధలు అయినా.. సంతోషాలు అయినా ఒకరికి ఒకరు తోడు ఉండాలి అని పెళ్లి రోజు ప్రమాణం చేసి.. ఏడాది కూడా తిరక్కుండానే ఆ ప్రమాణాన్ని తప్పుతున్నవారు ఎంతోమంది. అందులో ఎక్కువ సెలబ్రిటీలు ఉండడం బాధాకరం. సీరియల్ అయినా.. సినిమా అయినా తెరపై జంటగా కనిపించేవారు.. బయట కూడా పెళ్లి చేసుకొని కలకాలం కలిసి ఉండాలని కోరుకునేవారు ప్రేక్షకులు. ఇక అలా ప్రేక్షకులు మెచ్చిన సీరియల్ జంట అమర్ దీప్- తేజస్విని.జానకి కలగనలేదు అనే సీరియల్ తో అమర్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సీరియల్ మధ్యలోనే బిగ్ బాస్ సీజన్ 7 ఆఫర్ రావడంతో.. తన కలను నెరవేర్చుకోవడానికి హౌస్ లోకి అడుగుపెట్టాడు. అమర్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్ కు ముందు.. తరువాత అని చెప్పొచ్చు. అంతకుముందు అసలు ఎవరు ఇతను అనేది తెలియదు. కానీ, బిగ్ బాస్ అమర్ గేమ్స్, ఎమోషన్స్ చూసి జనాలకు మెంటలొచ్చేసింది.పిచ్చోడో తెలియదు.. స్ట్రాటజీ వాడుతున్నాడో తెలియదు.. ఎందుకు అరుస్తాడో.. ఎందుకు ఏడుస్తాడో.. ప్రేక్షకులకే కాదు.. అసలు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా తెలియదు. ఎలాగోలా టాప్ 5 లో నిలబడి అమర్ బయటకు వచ్చాడు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు అమర్ పై చాలా ట్రోల్స్ జరిగాయి. అమర్ భార్య తేజస్విని, తల్లిని కూడా నీచంగా తిట్టారు. ఆ సమయంలో తేజు.. భర్తకు సపోర్ట్ గా నిలబడింది. మా ఇంట్లో అమర్ ఎలా ఉంటాడో.. అక్కడ కూడా అలానే ఉన్నాడని చెప్పుకొచ్చింది.
అమర్ సైతం.. తనేంటి, పెళ్లి తరువాత తాను ఎలా మారాను అనేది తేజుకు చెప్పాను.. ఆమె అర్ధం చేసుకున్న విధానానికి రుణపడి ఉంటాను అని ఎమోషనల్ అయ్యాడు. బయట అమ్మాయిలతో ఎంత క్లోజ్ గా ఉన్నా .. తేజు మాత్రం తన ప్రాణం అని చెప్పుకొచ్చాడు. ఇక అలాంటి ఈ జంట.. ఒక షో లో తాము పెళ్లి తరువాత హ్యాపీగా లేమని చెప్పి షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ తరువాత.. అదే టైమ్ కు ఇస్మార్ట్ జోడీ అనే షోను స్టార్ట్ చేశారు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో రియల్ కపుల్స్ తో గేమ్స్.. డ్యాన్స్ లు.. అన్ని ఎమోషన్స్ ను చూపిస్తారు.
గతవారం గ్రాండ్ గా మొదలైన ఈ షోలో అమర్- తేజు కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. వెడ్డింగ్ థీమ్ కావడంతో అందరూ తమ తమ సాంప్రదాయాలను గౌరవించి దుస్తులు ధరించారు. వారు వచ్చాక ఓంకార్ అడిగిన ప్రశ్నలకు ప్రతి జంట సమాధానాలు చెప్పుకొచ్చారు. ఇక అమర్- తేజు రాగానే.. ఒక 10 కుర్చీలు లైన్ గా పెట్టి.. వారి మధ్య దూరం ఎంత ఉందో చూపించారు.
భార్యాభర్తలుగా మీరు వందశాతం హ్యాపీగా ఉన్నారా.. ? అని అడిగిన ప్రశ్నకు ఇద్దరు నో అని చెప్తూ.. చైర్ లో నుంచి లేచి దూరం జరిగారు. దీంతో వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా.. ? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి అమర్ .. తన పెళ్లి గురించి ఎలాంటి విషయాలను చెప్తాడో తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే.
Latest News