by Suryaa Desk | Fri, Dec 27, 2024, 04:08 PM
అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన విచారణను సోమవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు పీపీ సమయం కోరడంతో కోర్టు సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టు విచారించింది. అన్నింటిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.ఇక తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఈరోజు వర్చువల్గా న్యాయస్థానం ముందు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అదే రోజు అల్లు అర్జున్ రిమాండ్పైనా కూడా విచారణ జరగనుంది.
Latest News