by Suryaa Desk | Sat, Dec 28, 2024, 12:58 PM
టాలీవుడ్ లో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో జెనీలియా ఒకరు. జెనీలియా 1987 ఆగస్టు 5న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు హరిణి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ.తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయింది జెనీలియా. బాయ్ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఈ తర్వాత జెనీలియా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ లు చేసింది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది. తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక జెనీలియా నటించిన బొమ్మరిల్లు భారీ విజయాన్ని అందుకుంది. చిలిపి చేష్టల అల్లరి అమ్మాయిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ ఆ లో ఆమె పేరు హాసిని. ఇప్పటికీ జెనీలియా హాసినిగానే అభిమానుల మదిలో మెదులుతూనే ఉంది. ప్రస్తుతం జెనీలియా లకు దూరంగా ఉంటుంది. వివాహం తర్వాత జెనీలియా ఫ్యామిలీ పైన్ ఎక్కువ దృష్టి పెట్టింది. 2012లో బాలీవుడ్‌లో అగ్రనటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జెనీలియా ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది.
జెనీలియా ఓ ఇంటర్వ్యూలో ఆమె భర్త రితేష్ గురించి మాట్లాడింది. ఆమె చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో రితేష్ బెస్ట్ భర్త అని చెప్పింది. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదు. మానసికంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇద్దరం మాట్లాడుకుని అర్థం చేసుకుంటాం. రితేష్ నేను సహనమే.. అదే మా జీవితం ఇలా సాగడానికి కారణం. నా భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ భర్త అని జెనీలియా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Latest News