by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:08 PM
రవి గౌడ్ మాట్లాడుతూ కళాశాలల పాఠశాలల సమయంలో పొద్దున మరియు సాయంత్రం విద్యార్థుల కోసం అధికంగా బస్సులు నడిపించాలని సమయానికి నడిపించాలని విద్యార్థులు సాయంత్రం వేళలో రెండు మూడు గంటలు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచాలని గంటలు గంటలు బస్ స్టాప్ లో విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్లి ఎప్పుడు చదువుతారు అని ప్రశ్నించారు, బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వున్న గ్రామాలకు బస్సులను నడిపించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
విద్యార్థులకు బస్సులలో నిలబడడానికి కూడా ప్లేస్ ఉండటం లేదని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని. తొందరలోనే అకాడమిక్ ఇయర్ ముగుస్తుందని విద్యార్థులకు పరీక్ష సమయాలకు సరైన టైంలో అత్యధికంగా బస్సులు నడిపించాలని ఇప్పటికీ కొన్ని గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదని అలాంటి గ్రామాలకు కూడా బస్సులు నడిపించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున ఈరోజు ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ . నాయకులు, నవీన్, ముగ్ధం అనిల్ గౌడ్, తడిగోపుల వినయ్, సామల శ్రీకాంత్, శ్రీనివాస్, దేవరాజు. తదితరులు పాల్గొన్నారు.