|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 02:48 PM
గంగాధర మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలు, నిల్వలు, వినియోగంపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు. చైనా మాంజా వల్ల పక్షులు, మానవులకు తీవ్ర ప్రమాదం జరుగుతోందని, ద్విచక్ర వాహనదారులకు గాయాలవుతున్నాయని తెలిపారు. మండల వ్యాప్తంగా అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పతంగులు ఎగరేసేటప్పుడు సాధారణ కాటన్ దారాలను మాత్రమే ఉపయోగించాలని, విద్యుత్ లైన్లు, జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఎగరేయవద్దని సూచించారు. చైనా మాంజా విక్రయాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.