|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:48 PM

దామరగిద్ద మండలానికి చెందిన కనకప్ప పారా అథ్లెటిక్ ఖెలో ఇండియా జాతీయ స్థాయి లాంగ్ జంప్ క్రీడలకు ఎంపికైనట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు డిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలకు విద్యార్థి ఎంపిక కావడం పట్ల క్రీడాకారులు, క్రీడాభిమానులు, అసోసియేషన్ సభ్యులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు.