![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 04:28 PM
తెలంగాణలో రైతు రుణమాఫీ విషయంలో BRSపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. 'ఏకమొత్తంలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక రుణమాఫీకి ఐదేళ్లు పట్టింది.
రెండోసారి రుణమాఫీ చేస్తామని BRS అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. కానీ, మేం 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేశాం' అని అసెంబ్లీలో చెప్పారు.