|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:48 AM
తొలిరోజైన బుధవారం రాత్రి కన్నెపల్లినుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. ఈ ఘట్టంతో నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మహా జాతరకు అంకురార్పణ జరిగింది. మరోవైపు కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగరం మండలం కొండాయినుంచి గోవిందరాజు కూడా బుధవారంమే గద్దెలపైకి చేరారు. జాతరలోని నలుగురిలో ముగ్గురు ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. దేవతల రాకతో భక్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. రెండవరోజైన గురువారం జాతరలో ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు.