|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 06:12 PM
కాచిగూడ డివిజన్ కుడ్బిగూడలో రూ. 22.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్, ఎర్ర బిష్మ దేవ్, బాబ్జీ, సునీల్ బిడ్లాన్ పాల్గొన్నారు.