|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:56 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన, ఈ నెలాఖరున స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు.ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 258 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, 169 మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.