|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:02 PM
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులందరికీ ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్‌తో పాటు వెల్కమ్ కిట్‌ను అందించనుంది. అబ్బాయిలకు షర్ట్, ప్యాంట్, అమ్మాయిలకు సల్వార్ కమీజ్ ఇస్తారు. వెల్కమ్ కిట్‌లో బ్యాగ్, నోటుబుక్స్, పెన్, పెన్సిల్, ఇతర స్టేషనరీ ఉంటుంది. ఈ సౌకర్యం ప్రభుత్వ కాలేజీలతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది.