|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 02:31 PM
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో పర్యటించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు, సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిగాచి కంపెనీలో ఏకంగా 54 మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం సిగాచీ కంపెనీ మాత్రమే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇచ్చిందని తెలిపారు. హామీల పేరుతో ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డివి వట్టి మాటలేనని, చేతలు మాత్రం లేవని హరీశ్‌రావు సెటైర్లు వేశారు. మృతి చెందిన కుటుంబాలకు రేవంత్ కోటి రూపాయల పరిహారం ఇస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు