|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 02:02 PM
TG: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో కారు ప్రమాదం జరిగింది. తుక్కుగూడ సమీపం ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న ఇదే ORRపై కారు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవకముందే రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.