|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 10:23 AM
AP: విశాఖ, విశాలాక్షినగర్‌లోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన అకుమర్తి శాంతికుమారి (28) కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. జోడుగుళ్లపాలేనికి చెందిన మృతురాలి తల్లి ఎ.రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాంతికుమారి ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని ఏసీపీ పేర్కొన్నారు.