|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 03:16 PM
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, కట్టంగూరు మండలం, యరసానిగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సర్పంచ్ అకిటి శంకర్ ముదిరాజ్ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, అణగారిన వర్గాల హక్కుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళ హక్కులు మరియు కుల నిర్మూలన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యాదయ్య, ఉపసర్పంచ్ పూజిత నాగరాజు, వార్డు సభ్యులు, నాయకులు కొరివి సంతోష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.