|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 03:12 PM
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పట్టణంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు నిర్వహించడంతో పాటు,రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.అలాగే కేంద్రంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు,విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.దళారులు రైతులను మోసం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,రైతులు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గారు తెలిపారు