|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 11:52 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం మరియు పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా.ఈ రోజు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ శేరిలింగంపల్లి ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యంలో 80 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ లు, దివ్యంగులకు 4 స్కూటీ లను గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు,గౌరవ CDPO శ్రీమతి కవిత గారు, గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గార్ల తో కలిసి అందచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మియాపూర్ డివిజన్ గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, గంగాధర్, ప్రసాద్, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, సూపర్ వైజర్లు కోమలి, మాధురి, జ్యోతి, నాగమణి, సువర్ణ,శ్రీలత, టీచర్లు తదితరులు పాల్గొన్నారు