|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 03:03 PM
దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజీ కొరతపై వస్తున్న వదంతులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అభ్యంతరకర కంటెంట్ తొలగించేందుకు ఉన్న 3 గంటల గడువును 1 గంటకు తగ్గించాలని యోచిస్తోంది. ఇంధన ధరలు, సరఫరా అంశాలపై పుకార్లు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.