|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 12:13 PM
TG: రాష్ట్రంలో సాదాబైనాలకు పరిష్కారం చూపిస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే సాదాబైనాల పట్టాల కోసం ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. 'భూ భారతి'లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజులు గడువుంటుంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. కాగా తప్పుడు సమాచారం లేదా పత్రాలు సమర్పిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.