|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 04:37 PM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాలో ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడా వేదికలలో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని తెలిపారు. క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ఇందుకు అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్ ఉపాసన కొణిదెల, సభ్యులు కావ్య మారన్, శశిధర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.