|
|
by Suryaa Desk | Fri, Apr 03, 2026, 03:16 PM
వేసవిలో శరీరంలోని నీటి లోపాన్ని తీర్చడానికి, అధిక నీటి శాతం కలిగిన సీజనల్ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను ఆహారంగా తీసుకుంటాం. అయితే, వంటగదిలో ఉండే కొన్ని సుగంధ ద్రవ్యాలు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శరీరాన్ని చల్లగా ఉంచడంలో సాయపడతాయి.సోంపు.. ఇది రుచి, వాసనకు ఫేమస్. చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపు తింటుంటారు. ఇది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఇది మంచి నేచురల్ మౌత్ ఫ్రెషనర్. అంతేకాకుండా ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సాయపడుతుంది. సోంపులో అనేక పోషకాలు ఉన్నాయి. సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు సమస్యల్ని తగ్గించడంలో సాయపడతాయి. కడుపులోని చెత్తను బయటకు పంపించడంలో సాయపడుతుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతాయి. దీంతో.. రోగాలన్ని తట్టుకునే శక్తి వస్తుంది. సమ్మర్‌లో సోంపు నీరు తీసుకోవడం వల్ల శరీరం కూల్ అవుతుంది. ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.