|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 04:33 PM
తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ చేసి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువతకు ఉచిత ఎంప్లాయబిలిటీ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8, 9 తేదీలలో ఓయూ ఎంప్లాయిమెంట్ బ్యూరోలో ఈ శిక్షణ జరగనుంది. డిగ్రీ, డిప్లొమా, పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నెల 8న ఉదయం 10 గంటలకు విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్‌తో హాజరుకావాలి. మరిన్ని వివరాల కోసం 8801528936 నంబర్‌ను సంప్రదించవచ్చు.