|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 11:22 AM
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన పాలనలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పిల్లలమర్రి రాములు, ప్రధాన కార్యదర్శి గరిడే కిషన్పూరీలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.