|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 12:28 PM
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి జీహెచ్ఎంసీ దుండిగల్ పరిధి మల్లంపేటలోని గ్రామంలోని ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ గారు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మైనారిటీ సోదర, సోదరీమణులకు, ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....ఈద్-ఉల్-ఫితర్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్న ఆయన, రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలు మనకు సహనం, నియమం, దాతృత్వం వంటి విలువలను నేర్పుతాయని తెలిపారు. గత పన్నండేళ్ళ కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలతో పాటు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కృషిచేశామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో మల్లంపేట ఈద్గాను మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉస్మాన్, మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, మాదాసు వెంకటేశం, హన్మంత్ రావు, అర్కల అనంతస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు ఎస్.వి సురేందర్ రెడ్డి, రంగయ్య, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.