|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 02:09 PM
పటాన్ చెరు మండల కేంద్రంలోని పాశమైలారం గ్రామంలో పటాన్ చెరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పటాన్ చెరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ యేపూరి శివానందం గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. లబ్ధిదారులైన బ్యాగరి శైలజ శంకరయ్య కుటుంబ సభ్యులకు యేపూరి శివానందం గారు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మెచ్చి, ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ సేవ చేసే నేతలకు,ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ రానున్న ఎన్నికల్లో కూడ ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో మన పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఏళ్లవేళలా నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం తోడుగా ఉంటారని పేర్కొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ యేపూరి శివానందం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, పాటి మాజీ ఉపసర్పంచ్ గోపాల్ యాదవ్, నందిగామ ఉపసర్పంచ్ బుక్క గోరెమియా మరియు ఇస్నాపూర్, లకడారం, రుద్రారం మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు