|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 03:48 PM
చౌటుప్పల్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ఆలే చిరంజీవి మాట్లాడుతూ, క్రీడా పోటీలలో తరచుగా పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో గత వారం రోజులుగా భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 13 గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఫైనల్ పోటీ నిర్వహించి, విజేతలకు మరో కౌన్సిలర్ బత్తుల జయమ్మతో కలిసి ఆలే చిరంజీవి బహుమతులు అందజేశారు.