|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 11:23 AM
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కళ్యాణ్ (36) అనే వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఇబ్రహీంపట్నానికి చెందిన కళ్యాణ్, ఇటీవల ఉప్పల్ నుంచి మేడిపల్లికి వెళ్తుండగా పీర్జాదిగూడ కామన్ వద్ద RTC బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.