|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 01:53 PM
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శోభతో ముస్తాబవుతోంది. ఆలయ అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, రామపట్టాభిషేకం, సీతారామ కళ్యాణం వంటి వైభవోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం పంపిణీ, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శ్రీరామ నవమి రోజున ఆలయం భక్తజనంతో కళకళలాడనుంది.