|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 04:11 PM
ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం “రైతు భరోసా” నిధులను విడుదల చేశారు.సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను విడుదల చేశారు.రైతుల ఖాతాల్లో నిధులు జమకావడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు.45 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలు రైతులందరి ఖాతాల్లో నిధులు చేరిపోతాయని ప్రకటించడం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు,బాలు నాయక్ గారు,చింతకుంట విజయరామనారావు గారు,యన్నం శ్రీనివాస్ రెడ్డి గారు,వేముల వీరేశం గారు,అద్దంకి దయాకర్ గారు,బల్మూర్ వెంకట్ గారు తదితరులు పాల్గొన్నారు.