|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 02:12 PM
వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువు మారాయని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. రీఫిల్ బుకింగ్ గడువులు మారాయని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న గడువులు మారలేదని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చని కేంద్రం స్పష్టతనిచ్చింది. గ్యాస్ సరఫరాపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది. ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని పేర్కొంది.