|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 03:23 PM
నర్సాపూర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆరు నెలలుగా నిలిచిపోయిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినప్పుడే చెక్కులు ఇస్తామని అధికారులు చెప్పడం ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ఈ పథకం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించిందే అన్న భావన ప్రజల్లో కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. వెంటనే చెక్కులు పంపిణీ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో స్పీకర్ మైక్ నిలిపివేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కును అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసన తెలిపే హక్కును హరించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.