|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 03:44 PM
హైదరాబాద్ శివారులోని కోహెడ పండ్ల మార్కెట్ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కన్ను పడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వాలు రైతుల కోసమే పని చేయాలని, దళారుల కోసం కాదని ఆయన అన్నారు. గతంలో మార్కెట్‌కు భూసేకరణలో భాగంగా రూ.10 కోట్లు రైతులకు ఇప్పించామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నామని తెలిపారు.ఈ ప్రాంతంలో పెద్ద మార్కెట్ వస్తుందని రెండు మూడు రకాలుగా కేసీఆర్ ఆలోచన చేశారు. ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన భూములను రేవంత్ రెడ్డి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నడు. ఇక్కడున్న మార్కెట్ ను ఎక్కడో గుట్టల్లో పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైంది. నాదర్ గుల్, కోహెడ భూముల పై ప్రభుత్వం కన్నేసి మొత్తం 10 వేల కోట్ల రూపాయలను దండుకోవాలని చూస్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రెండేళ్లు పాటు ఈ కోహెడ మార్కెట్ స్థలాన్ని కాపాడుకుందాం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందాం.