అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 02:19 PM
కుబీర్ మండలంతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా మారి గాలి దుమారం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అర్ధరాత్రి వరకు అంధకారం నెలకొంది. ఈ అకాల వర్షానికి చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నేలకొరిగిన పంటను కోయడానికి కూలీల ఖర్చులు పెరిగిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊహించని వాతావరణ మార్పులతో రైతులు నిచ్చేస్తులయ్యారు.