|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:32 AM
రాయచూర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) కర్ణాటక రాష్ట్ర మహాసభలకు నారాయణపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు తరలి వెళ్లారు. జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రైతన్నలను, వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని, ఈ తరుణంలో రాయచూర్ లో జరిగే మహాసభలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రైతాంగ ఉద్యమాలకు బలం చేకూరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, పి ఓ డబ్ల్యు విజయలక్ష్మి, సునీత, జి వెంకట్ రాములు, ఎదురింటి రాములు, నీలి దామోదర్, పీర్ మైనుద్దీన్, నర్సింలు, అంబదాస్ పాల్గొన్నారు. ఈ మహాసభలు మార్చి 30, 2026న జరిగాయి.