|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 01:52 PM
శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయ భూములను అన్యక్రాంతం కాకుండా కాపాడాలని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ 35 లో ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని ఇతరులు ఆక్రమించుకుంటున్నారని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి దేవుని ఆస్తులను కాపాడాలని వారు పేర్కొన్నారు. ఈ భూమి విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అంజి, రాఘవేందర్, భీమేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.