|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 02:43 PM
ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా వ్యాపారాలు చేసుకునేలా అవకాశం.ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిన నాయకుడు.ఉప్పల్ ప్రాంతంలో వీధి వ్యాపారులకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి అండగా నిలిచారు. వీధి వ్యాపారులు రోడ్డున పడకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసి యథావిథిగా వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించారు.ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగురోడ్డులో ఉన్న వరంగల్ బస్టాప్‌ను ఉప్పల్ నల్లచెరువు ప్రాంతానికి తరలించనున్నారు. దీంతో నల్ల చెరువు ప్రాంతంలో ఉన్న వీధి వ్యాపారులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు.వీధి వ్యాపారులు ఇదే విషయాన్ని పరమేశ్వర్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఏళ్ల తరబడి ఇక్కడనే చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నట్టుగా వాపోయారు. దీంతో పరమేశ్వర్‌రెడ్డి బుధవారం ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ గారు,ఇన్‌స్పెక్టర్‌లు రామలింగ రెడ్డి గారు,నాగరాజు గారి తో మాట్లాడారు. వారితో కలిసి నల్లచెరువు వద్ద వీధి వ్యాపారాలు చేసే స్థలాన్ని అధికారులతో కలిసి పరమేశ్వర్‌రెడ్డి గారు పరిశీలించారు. ట్రాఫిక్ అధికారుల సూచన మేరకు అదే ప్రాంతంలో ట్రాఫిక్ కు ఆటంకం లేకుండా వ్యాపారాలు చేసుకునేలా స్థలాన్ని చూపించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో విధి వ్యాపారులు పాల్గొన్నారు