|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 04:07 PM
నల్లగొండ పట్టణంలో మంగళవారం 'నో హెల్మెట్- నో డ్రైవింగ్' పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. ఎన్జీ కళాశాల వద్ద వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ సీఐ మహాలక్షయ్య, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పట్టుబడిన వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.