|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 02:40 PM
రేవంత్ రెడ్డిని తానే సీఎంని చేశానని, రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ ఒక్కడే పవర్ ఫుల్ లీడర్ అని ఆయన మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్, తాను అన్నదమ్ములమని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలతో మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీఎంతో ఉన్న సాన్నిహిత్యం గురించి బహిరంగంగా మాట్లాడటం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాల గురించి మాట్లాడుతూ, 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో విలన్ పాత్రకు నో చెప్పానని, సీఎం పాత్ర చేయాలని ఉందని తన కోరికను వెల్లడించారు.