|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:28 PM
సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో సీఎం పర్యటన సందర్భంగా, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 8 ముఖ్యాంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం, మల్లన్న సాగర్ కింద దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాలువల ద్వారా నీటి సరఫరా, తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలంలోని ఎనిమిది గ్రామాలకు నీళ్లు అందించడం, హబ్సిపూర్ నుంచి దుబ్బాక వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, ఎనగుర్తి చౌరస్తా నుంచి శిలాజీ నగర్ వరకు డబుల్ రోడ్డు మంజూరు, కొండపాక మండల కేంద్రంలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆయిల్ ఫామ్ కంపెనీల ఏర్పాటు వంటి అంశాలపై ఎంపీ విజ్ఞప్తి చేశారు.