|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 12:21 PM
రామచంద్రాపురం : ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతీకలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరజించారు. ముస్లిం సోదరులకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.