|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 11:43 AM
జెపి కాలనీ డివిజన్ పరిధిలోని APR లక్సూరియా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి మరియు శ్రీ సీతా సమేత శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 28వ తేదీ శనివారం నాడు నిర్వహించనున్న సందర్భంగా ఈ రోజు పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు APR లక్సూరియా కాలనీలోని శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి, శ్రీ సీతా సమేత శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయాన్ని సందర్శించి శనివారం జరగనున్న ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాల కొరకు ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని GHMC శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య గారిని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, దిలీప్ గారు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు, రాకేష్ గారు, రమేష్ గారు, బాలకృష్ణ గారు, సుధీర్ రెడ్డి గారు,APR లక్సూరియా కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.