|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 11:50 AM
TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, లక్నో (SRH vs LSJ) మధ్య ఉప్పల్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. డిస్ట్రిక్ట్ యాప్‌లో అభిమానులు కొనుక్కోవచ్చని ఫ్రాంఛైజీ వెల్లడించింది. ప్రతి రెండు టికెట్లకు ఒక సన్‌రైజర్స్ జెర్సీని ఉచితంగా పొందొచ్చని తెలిపింది.