|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 02:50 PM
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల 'నో స్టాక్' బోర్డులు దర్శనమివ్వడంతో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు బంకులకు పోటెత్తారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. JGTL, PDPL, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంధన నిల్వలపై సందిగ్ధతతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.