|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 10:40 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటిలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఆమె ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల వైద్యులు ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.