|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 04:15 PM
పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేషన్ పేరుతో ఇచ్చే పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని...అవి ఓఆర్‌ఎస్‌లు కాదు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు.. డాక్టర్ శివరంజని హెచ్చరిక! పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేషన్ పేరుతో ఇచ్చే పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం. శివరంజని సంతోష్ హెచ్చరించారు. మార్కెట్లో లభించే అనేక కమర్షియల్ ‘హైడ్రేషన్’ ప్రొడక్ట్స్ డయేరియా (విరేచనాలు) వంటి సమస్యలను మరింత తీవ్రం చేస్తాయని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌ఓ (WHO) సూచించిన ఓఆర్ఎస్ (ORS) ప్రాణ రక్షకమని, అయితే దానికి బదులుగా మార్కెట్లో అనేక చక్కెరతో కూడిన ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌ను తప్పుదోవ పట్టించేలా విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.